Balayya Balakrishna unleashed questions to chandrababbu unstoppable 2 with nbk
mictv telugu

బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి.. అన్‌స్టాపబుల్‌-2 ఫస్ట్ ఎపిసోడ్‌లో రచ్చ

October 4, 2022

బాలయ్యలోని సరికొత్త కామెడీ యాంగిల్‌ను బయటకి తీసుకొచ్చిన షో ఖచ్చితంగా ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బికె’. ఎప్పుడూ అభిమానులను తిడుతూ, కొడుతూ ఉండే సీరియస్ బాలకృష్ణలోని తుంటరి తనం అందరికి తెగ నచ్చేసింది. దాంతో ‘Unstoppable With NBK సీజన్-1’ సూపర్ హిట్ అయింది. ఎంతటి వారినైనా తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ గెస్టులని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు బాలయ్య. మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీతో తో మొదలైన ఈ షో.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎపిసోడ్‌తో ఎండ్ అయింది. గెస్టులతో బాలయ్య చలాకీతనం, చిలిపితనం, గాంభీర్యం అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దాంతో సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా ఆహా అప్‌డేట్ ఇచ్చింది. ఒక పాటను కూడా విడుదల చేసింది. నేడు విజయవాడలో టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఈ హడావిడి కంటే ముందే నారా నందమూరి అభిమానులకి బాలకృష్ణ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

అన్‌స్టాపబుల్‌ సీజన్ 2లో తోలి గెస్టుగా తన బావ.. టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు బావ చంద్రబాబుతో బాలయ్య తోలి ఎపిసోడ్ షూట్ కూడా ఫినిష్ చేసేశాడట. ఈ సంచలన ఎపిసోడ్ కి సంబదించిన వర్కింగ్ పిక్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అన్‌స్టాపబుల్‌- 2 సెట్స్‌లో తన బావమరిది బాలయ్యతో చంద్రబాబు సందడి చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇంతకీ వీరిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగి ఉంటుందని ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే అందరిని తనదైన శైలిలో ప్రశ్నించే బాలయ్య.. బావ చంద్రబాబుని కూడా చిలిపి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం కావటంతో.. ఎక్కువగా వ్యక్తిగత విషయాలపైనే బాలయ్య ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. బాలకృష్ణ ప్రశ్నలకు చంద్రబాబు కూడా హుషారుగా బదులిచ్చాడని లీక్స్ వస్తున్నాయి. ఇక వీటితో పాటు తన కుటుంబంపై పర్సనల్ అటాక్, తనపై బూతులు, ఎన్టీఆర్ కి వెన్నుపోటు అంశం వంటి సీరియస్ టాపిక్స్ కూడా బాలయ్య టచ్ చేశాడని సమాచారం. అయితే ఈ సీజన్ 2 తోలి ఎపిసోడ్‌కి మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆఖర్లో నారా లోకేష్ ఎంట్రీ కూడా ఉండనుందట. ఏదేమైనా బాబు,బాలయ్యల కాంబినేషన్ చూడడానికి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు, ప్రజలు,ప్రతిపక్షాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.