హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాడింగ్ చేశారు. వీరసింహారెడ్డి చిత్ర ఫ్రీ రిలీజ్ ఇవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. అనంతరం శనివారం ఉదయం తిరిగి హైదరాబాద్ హెలీకాప్టర్‌లో పయనమయ్యారు. పైకి ఎగిరిన 20 నిమిషాలు తర్వాతహెలీకాప్టర్లో పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్లో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హెలీకాప్టర్‌లో హీరో బాలకృష్ణతో పాటు హీరోయిన్ శృతిహాసన్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తదితరులు ఉన్నారు.
బాలకృష్ణ హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం అన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో అభిమానులు కంగారుపడ్డారు. ఏమైందా అని ఆందోళనకు గురయ్యారు. చివరికి ఎటువంటి ప్రమాదం లేదని తెలియడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా హీరో బాలకృష్ణ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం.
వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా లో నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్యతో ఇతర నటీనటులు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ ఉత్సాహంగా కనిపించారు. ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్‌లోని దివి నుంచి దిగివచ్చావా పాట సమయంలో దానిని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కూర్చిలో కూర్చొనే స్టెప్పులు వేశారు. ఈ ఫంక్షన్ లో విడుదల చేసిన వీర సింహారెడ్డి ట్రైలర్ ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్ డైలాగ్‌లతో బాలయ్య ఇరగదీశాడు. గోపించద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటించింది.