నందమూరి బాలకృష్ణ అంటే అందరూ భయపడతారు. కోసం ఎక్కువ అని అందరూ చెబుతుంటారు. అయితే బాలయ్యను దగ్గరగా చూసిన వారు ఆయనతో పరిచయం ఉన్న వారు మాత్రం చెప్పేది ఒక్కటే ఆయన కూలెస్ట్ పర్సన్ అని.అలాగే ఆయనది మంచి మనసు అని కూడా అంటున్నారు బాలయ్య బాబు రెండో అల్లుడు శ్రీభరత్.. మరి బాలయ్య రెండవ కుమార్తె తేజస్వినిని పెళ్లి చేసుకున్న గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్. ఒక యూ ట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య మీద కామెంట్స్ చేశారు. తనకు బాలయ్య రెండవ కుమార్తెతో వివాహం జరుగుతుంది అని తెలియగానే బాలయ్య గురించే మొదట ఆలోచించానని, తనకు సినీ ప్రపంచం అంటే తెలియదు అని తాను వేరే విధంగా పెరిగాను అని చెప్పుకొచ్చారు.
మా మామగారికి కోపం ఎక్కువ అని అనుకున్నాను కానీ ఆయనను మొదటి సారి కలవగానే తన అభిప్రాయాలు అన్నీ మారిపోయాయని చెప్పారు. ఆయన చాలా మంచి వారు, చిన్న పిల్లల మనస్తత్వం అని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని…. ఎదుటి వారు చెప్పినది కూడా వింటారని శ్రీ భరత్ తన మామ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.
తాను గత మూడేళ్ళుగా శ్రీ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉంటున్నాను అని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధి విషయంలో మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు మామగారికి చెబుతానని ఆయన దానిని పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారని అన్నారు. మొత్తానికి బాలయ్యని మంచి మామయ్య అనే బిరుదునిచ్చారు.
అయితే తాను రాజకీయాల్లోకి వెళ్ళడం తన భార్య తేజస్వినికి ఇష్టం లేదని అయినా తన కోసం ప్రచారం చేసిందని భరత్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓడిపోయినపుడు అంతా భయపడ్డారని తాను ఎలా అయిపోతానో అనుకున్నారని కానీ తాను ఒక్క రోజు మాత్రమే బాధపడి వదిలేసానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయనున్న శ్రీ భరత్ అయిదేళ్ళుగా తన బలాన్ని పెంచుకున్నారు.విశాఖ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.