హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య భారీ విరాళం..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య భారీ విరాళం.. 

October 18, 2020

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వానలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యలో కాస్త శాంతించాయి అనుకుంటే మళ్లీ వానలు కురుస్తుండటం ప్రజల్లో గుబులు రేపుతోంది. పాత ఇళ్లు కూలి, కార్లు, బైకులు వరదలకు కొట్టుకుపోయి మనుషులు మృత్యువాత పడుతున్నారు. కరోనా సమయంలో ఇది నగరవాసులకు కోలుకోలేని దెబ్బే. మరోవైపు వివిధ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వీధుల్లో సహాయక బృందాలు పడవల్లో సంచరిస్తూ ప్రజలను కాపాడుతున్నారంటే నగరంలో వర్షపాతం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇలాంటి విపత్తు సమయంలో నేనున్నాను అన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. తనవంతుగా హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించారు. మరోపక్క ఇటీవల రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వాళ్లకి అండగా నిలిచారు బాలయ్య. 

అదే విధంగా పాతబస్తీలో బసవతారకరామా సేవసమితి ఆధ్వర్యంలో 1,000 కుటుంబాలకు బిర్యానీ ఏర్పాటు చేసి వాళ్లకు పంపించారు. ఇంకా ఏదైనా అవసరం కావాలన్నా కూడా తాను ముందుంటానని బాలయ్య హామీ ఇచ్చారు. ఇదిలావుండగా వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కిట్ అందిస్తోంది. బియ్యం – 5kg, 

పప్పు – 1kg, వంట నూనె – 500ml, కారంపొడి – 200 gm, పసుపు – 100 gm, ఉప్పు – 1kg, చింతపండు – 250 gm, గోధుమ పిండి – 1kg, చాయ్ పత్తి – 100 gm, చక్కెర – 500 gm తదితర వస్తువులతో పాటు ఒక దుప్పటిని కూడా ప్రభుత్వం అందిస్తోంది.