బాలయ్య చిత్రం వీరసింహారెడ్డి ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒంగోలులో జరుగుతున్న ప్రిరిలీజ్ ఈవెంట్లో కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ట్రైలర్ లోని డైలాగులు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకుంటున్నాయి. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పనితనం డైలాగుల్లో కనపడుతోంది. మైలురాయికి మీసం మొలిసినట్టుండాది, ప్రతీ పబ్బులో చివరి పది నిమిషాల్లో వినిపించేది జై బాలయ్యే, పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం ఏలుతుంది కర్నూల్ అంటూ బాలయ్య చెప్తున్న డైలాగులు థియేటర్లో పూనకాలు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ముసలిమడుగు ప్రతాపరెడ్డిగా కన్నడ స్టార్ దునియా విజయ్ విలనిజం బాలయ్యకు ధీటుగా ఉండనుంది.