దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల.. విశ్వక్ రేంజ్ పెంచే చిత్రం - MicTv.in - Telugu News
mictv telugu

దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల.. విశ్వక్ రేంజ్ పెంచే చిత్రం

November 18, 2022

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ధమ్కీ ట్రైలర్ 1 శుక్రవారం బాలయ్య చేతుల మీదుగా రిలీజైంది. అన్ని అంశాలు మేళవించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఫన్, రొమాన్స్, ఫైట్స్, డ్రామా, పాటల చిత్రీకరణ చూస్తే ఈ చిత్రం కచ్చితంగా విశ్వక్ స్థాయిని పెంచుతుందనే నమ్మకం కలుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న ఈ సినిమాకు కథ ప్రసన్నకుమార్ అందించారు. హీరో, దర్శకుడు, నిర్మాత అన్నీ విశ్వక్ సేన్ కావడం గమనార్హం. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య హుషారుగా ప్రసంగించారు.

తాను ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటానని, కానీ, అభిమానులు ఒప్పుకోరు కాబట్టి నన్ను నేను ఊహించుకుంటానన్నారు. లెజెండ్ సినిమాలోని గెటవుట్ ఆఫ్ మై సిటీని పోలిన చిత్రంలోని గెటవుట్ ఆఫ్ మై కార్ డైలాగుని పలికి అలరించారు. ఇక ఫ్యాన్స్ ఆదిత్య 999 గురించి అడిగితే వచ్చే ఏడాది ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న వీరసింహారెడ్డి గురించి చెప్పమంటే.. దర్శక నిర్మాతలు నాకు దొబ్బులు పెడతారంటూ నవ్వించారు.