బట్టతల అని కుంగిపోకండి.. అమ్మాయిలకు మీరంటేనే ఇష్టం... - MicTv.in - Telugu News
mictv telugu

బట్టతల అని కుంగిపోకండి.. అమ్మాయిలకు మీరంటేనే ఇష్టం…

November 18, 2020

BATTA

చిన్నవయసులోనే జుట్టు రాలుతోందన్న బాధతో హైదరాబాద్‌‌లో ఓ యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. జట్టు రాలిపోతోందన్న ఆవేదనతో ఎందరో యువకులు నలిగిపోతున్నారు. అమ్మాయిలు తమను ఇష్టపడని, పెళ్లిళ్లు కావని కుంగిపోతున్నారు. కానీ, ఈ ఆవేదనంతా వట్టి అర్థరహితమని సర్వేలు, ప్రేమ కథలు చెబుతున్నాయి. పైగా జట్టున్న వారికంటే బట్టతల ఉన్నవారంటే అమ్మాయిలకు పిచ్చి అని ఘోషిస్తున్నాయి. బాల్డ్ హెడ్ ఉన్నవారు మిగతా వారికంటే అత్యంత నిజాయతీగా, ప్రేమగా, సెక్సీగా, పరిణత మనస్తత్వంలో ఆకట్టుకుంటారని వెల్లడైంది. ఇదేదో, ఆత్మవిశ్వాసం రంగరించి పోయడానికి అల్లిన కథనం కాదు. శాస్త్రీయంగా రుజువైందే. 

పిల్లలంటే ఇష్టపడని వారు ఉండరు కాదు. బోడిగుండుతో, బోసి నవ్వుతో అందమంతా కుప్పబోసినట్లు ఉంటే పిల్లల్లో మీరు ఒక సంగతి గమనించారా? పిల్లలపై నెత్తిపైన పెద్దగా జుట్టు ఉండదు. అయినా వారు అందంగా ఉంటారు. ఇదే లాజిక్ బట్టతల ఉన్న మగవారికి కూడా వర్తిస్తుంది. బట్టతలకు కారణమయ్యే వెలస్ హెయిర్ అనే ఫోలికల్స్ బుడ్డోళ్ల నెత్తిపైనా ఉంటాయి. అందుకే వాళ్ల బోడిగుండోళ్లుగా కనిపిస్తారు. చూడ్డానికి తెగ ముద్దొస్తుంటారు కనుక ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా పిల్లల్ని చూడగానే కిస్ ఇచ్చేస్తారు. 

పరిశోధనలు ఏమంటున్నాయి?

జాతస్య మరణం ధ్రువం.. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు. మన శరీరంలోని కణాలు ప్రతి క్షణానికి నశించిపోతుంటాయి. అలాంటిది మధ్యలో మొలిచిన ‘బోడి’ వెంట్రుకలు ఎంత? వాతావరణ కాలుష్యం, తిండిలో మార్పు, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల గతంలో కంటే ఇప్పుడు బట్టతలలు పెరిగాయి. 35 ఏళ్లు దాటిన వారిలో గంతో 50 శాతం వెంట్రుకలు పల్చబడేవి. ఇప్పుడు ఏకంగా 65 శాతం పెరిగిందీ లెక్క. అయితే ఇది కేవలం భౌతిక మార్పు మాత్రమేనని, బట్టతల ఉన్నవాళ్లు మానసికంగా ధైర్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టతల అదృష్టమని మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ప్లాట్ వీరులు నిజాయతీపరులు, మేధావులు, విద్యావంతులు, లౌక్యం తెలిసిన వారు, ప్రభావం చూపేవారుగా ఉంటారని ఫ్లోరిడాలోని బ్యారీ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. జులపాల రాయుళ్లతో పోలిస్తే గుండోళ్లు ఎక్కువ సోషలైట్ గా ఉంటారని, పరిణతితో స్పందిస్తారని  తెలుసుకున్నారు. వీరిలో దూకుడు స్వభావం అంతగా ఉండదు కనుక అందరినీ ఆకర్షిస్తారని వెల్లడైంది. 

ఆరోగ్యంగానూ మంచిదే

బట్టతల ఆరోగ్యానికి కూడా మంచిదేనని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వీరికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని గుర్తించారు. ఇక చుండ్రు, గజ్జి, తామర వంటి సమస్యలు ఉండవన్నది అందరికీ తెలిసిందే. 

ఆ స్టయిల్ సూపర్ 

బట్టతల అందరికీ అంత అందంగా ఉండకపోవచ్చు. అందుకని హెయిల్ స్టయిల్ నిపుణును సంప్రదించి తమకు సరిపోయే స్టైల్ ఎంచుకోవాలి. క్లీన్ షేవ్ దగ్గర్నుంచి హెయిర్ ప్లాంటేషన్ వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. క్లీన్ షేవ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. హాలీవుడ్ హీరోలు విన్ డీజిల్, జేసన్ స్టాథామ్, ఎల్ ఎల్ కూల్ వంటి వారంతా క్లీన్ షేవ్ లతో అమ్మాయిల వలపు దోచుకుంటున్నోళ్లే. కాబటి ఇకపై జట్టు లేదన్న బాధ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసేయ్యండి.