ఆశ్చర్యం.. జగన్‌తో బాలినేని చర్చల్లో టీడీపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఆశ్చర్యం.. జగన్‌తో బాలినేని చర్చల్లో టీడీపీ ఎమ్మెల్యే

April 11, 2022

 

bbbbbb

మంత్రి పదవి రాలేదని అలకబూనిన బాలినేని శ్రీనివాస రెడ్డిని ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఆయన నివాసానికి వెళ్లి నచ్చజెప్పాలని చూశారు. అయినా బాలినేని అలక వీడకపోవడంతో విషయం ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్లింది. దీంతో బాలినేనిని తన వద్దకు తీసుకురావాలంటూ జగన్ ఆదేశించడంతో సజ్జల మూడోసారి బాలినేని ఇంటికి వెళ్లి, సుదీర్ఘంగా చర్చించారు. ఎట్టకేలకు జగన్‌ను కలిసేందుకు ఒప్పించారు. ఈక్రమంలో ఆదివారం నుంచి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బాలినేని నివాసం వద్ద కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సజ్జల నచ్చజెప్పడంతో బాలినేని జగన్‌తో మీటింగుకు బయలుదేరగా, ఆయన వెంట కరణం కూడా వెళ్లారు. బాలినేనితో జగన్ జరిపే చర్చల్లో కరణం కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.