పబ్ కేసులో రేవంత్‌పై బాల్క సుమన్.. సంచలన ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

పబ్ కేసులో రేవంత్‌పై బాల్క సుమన్.. సంచలన ఆరోపణలు

April 4, 2022

bfbfb

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌లో శనివారం రాత్రి బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భాగంగా పబ్‌లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో సంచలనంగా మారింది. అయితే, పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఈ పబ్‌ ఘటనపై స్పందిస్తూ, పలు కీలక విషయాలను వెల్లడించారు.

”పబ్‌‌ను నడుపుతున్న నిర్వాహకులు జాతీయ పార్టీ నాయకులు. పబ్‌ ఓనర్‌ అభిషేక్‌ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకు. అదేవిధంగా ఇంకొంక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు ప్రణయ్ రెడ్డి. ఈయన పీసీసీ రేవంత్ రెడ్డి మేనల్లుడు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహిస్తే, ఆయన వెనకనుంచి ప్రజలకు దండం పెడుతుండు. ఈ ఫోటోలను ప్రజలకు చేరవేయండి. దీనిని బట్టి స్పష్టంగా అర్థమైతున్నది దేమిటంటే.. ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు, నాయకుల పిల్లలు అందులో పాల్గొనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు విడుదల చేసిన లిస్ట్‌లో ప్రణయ్ రెడ్డి పేరు 24వ పేరుగా ఉంది” అని బాల్క సుమన్ అన్నారు.

అంతేకాకుండా సైకో సంజయ్, ఛీప్ రేవంత్ రెడ్డిలు ఇప్పుడు సమాధానాలు చెప్పండి అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ కల్చర్, విచ్చలవిడి తనం ఉన్నదే బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల్లో ఈ సంస్కృతి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమైతుందన్నారు. కావున ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని, ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పండి అని డిమాండ్ చేశారు. ఒకేవేళ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీలకు సరైన బుద్ది చెప్తారు అని బాల్క సుమన్ హెచ్చరించారు.