గోదావరి నదికి వస్తున్న వరదల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద ఇద్దరు మేకల కాపరులు చిక్కుకుపోయారు. మేకలు కాసేందుకు వెళ్లిన వారు తిరిగొచ్చే సమయానికి వరద పెరగడంతో సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కారు. అలాగే నిలబడి సహాయం కోసం ఎదురు చూడగా, వరదను చూసి గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ పరిస్థితిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కేటీఆర్ కాపరులను కాపాడేందుకు హుటాహుటిన హెలికాప్టర్ తెప్పించారు. దాని ద్వారా ఇద్దరినీ కాపాడి సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. సమయానికి స్పందించి, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్.. మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.