టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ.. లక్ష మాయం - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ.. లక్ష మాయం

April 7, 2018

టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో దొంగలు పడ్డారు. మంచిర్యాల పట్టణంలోని గౌతమ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో  శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. సుమన్ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బాల్క సుమన్‌, ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మీడియా యత్నించింది. అయితే వారు అందుబాటులోకి రాకపోవడంతో ఎంత డబ్బు, బంగారం పోయాయో తెలియడం లేదు.పోలీసులు కూడా ఈ కేసు వివరాలను వెల్లడించడం లేదు. రేపోమాపో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రెండు నెలల కిందట కూడా చోరీ జరిగింది. సుమన్ ఇంటిని దొంగలు టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.