బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలు - MicTv.in - Telugu News
mictv telugu

బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలు

January 27, 2020

Hair.

కడుపులో కత్తెర్లు, దూది, మేకులు, కంతులను, చివరికి పశువుల కడుపులో ప్లాస్టిక్ కవర్లు తీయగా విన్నాం, చూశాం. కానీ, కడుపులో అరకిలో వెంట్రుకలు బయటపడటం చూశామా? కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ బాలిక (13) కడపులో అరకేజీ జుట్టును వైద్యులు గుర్తించారు. వాటిని చూసి ఆస్పత్రి సిబ్బంది షాకింగ్‌కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. బాధిత బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆ బాలిక గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో బాలికను తల్లిదండ్రులు సమీపంలో వీజీఎమ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించి కడుపులో బంతి ఆకారంలో ఎదో వస్తువు ఉందని తొలుత గుర్తించారు. దానిని తొలగించడానికి సర్జరీ చేశారు. ప్రముఖ వైద్యుడు గోకుల్‌ కృపాశంకర్‌ నేతృత్వంలోని వైద్యబృందం సర్జరీ చేశారు.  

బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలతో పాటు ఖాళీ షాంపూ పాకెట్లు, మరికొన్ని ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూడగానే వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. మొత్తానికి బాలికను రక్షించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులతో వైద్యులు మాట్లాడగా… ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు.