బంతికి ఉమ్మి.. ఎవరి బ్యాగు వారికే - MicTv.in - Telugu News
mictv telugu

బంతికి ఉమ్మి.. ఎవరి బ్యాగు వారికే

September 10, 2020

Akshay Kumar reveals he drinks cow urine every day...

కరోనా వైరస్ కారణంగా ఉంటుందో లేదో అనే అనుమానాల మధ్య ఎట్టకేలకు అబుదాబి వేదికగా ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న తొలిమ్యాచ్ జరగనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆటపైనే కాకుండా సాధనలో కూడా అనేక కరోనా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై ఆటగాళ్లు తమ తమ భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సాధన చేస్తున్న ముంబయి లీగ్ ఆటగాళ్లు అందరికీ ఎవరి బ్యాగ్ వారికి ఇచ్చారు. ఇదివరకు బంతి మీద ఉమ్మి రుద్దడం అలవాటు ఉన్నవారి కోసం ఈ ఏర్పాటు చేశారు. ఎందుకంటే సాధనకు ఉపయోగించిన బంతులన్నీ ఎవరి సంచిలో వారే వేసుకోవాలి. తిరిగి వాటినే ఉపయోగించాలి. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడం కోసమే ఇలా చేస్తున్నాం అని జాక్‌ తెలిపాడు. క్రికెటర్లందరూ ప్రత్యేకమైన మానసిక స్థితిని అలవరుచుకోవాలని సూచించాడు. ‘ఇవన్నీ కష్టంగా లేవని అనను. అయితే అలవాటు పడటానికి కొద్ది సమయం పట్టొచ్చు. ఆటలో పద్ధతులు పూర్తిగా మారాయి. వాటిని మనం పాటించాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. బంతిపై ఉమ్మి రాయకుండా ఉండేందుకు మేము జాగ్రత్త పడుతున్నాం. అయితే పాత అలవాటు మాత్రం బౌలర్లను వదలడం లేదు. ఈ లాక్‌డౌన్ మనసును నియంత్రించేందుకు ఉపయోగపడింది. ఒక్కో ఆటగాడి మానసిక పరిస్థితి ఒక్కోలా ఉంటుంది’ అని జాక్ తెలిపాడు. 

ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ఖాన్‌ ఇదో సరికొత్త సాధారణం అని చెప్పుకొచ్చాడు. పరిస్థితులు కాస్త కష్టంగానే ఉన్నా త్వరగానే అలవాటు పడొచ్చని అన్నాడు. కరోనా ముప్పు ఉండటంతో ఇవన్నీ తప్పవని.. తమ జట్టు ఆటగాళ్లు కొత్త పద్ధతులకు వేగంగానే అలవాటు పడుతున్నారని తెలిపాడు. కాగా, కరోనా వైరస్‌ కారణంగా.. బయో బుడగలో సాధనా శిబిరాలు సాగుతున్నాయి. సాధనలో ఆటగాళ్లు ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, క్రమం తప్పకుండా శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించుకోవడం, బంతిపై మెరుపు కోసం ఉమ్మి రుద్దకుండా ఉండటం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా కచ్చితమైన ఆంక్షలు విధించారు. వాటిని అనుసరిస్తున్న ఆటగాళ్లు చాలామంది ఇవన్నీ కష్టంగా ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు.