గుణపాఠాలు నేర్చుకున్న శిల్పాశెట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

గుణపాఠాలు నేర్చుకున్న శిల్పాశెట్టి..

July 29, 2017

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి రోజు రోజుకు ఫాష్యన్ విషయంలో, అందరి కంటే కొత్తగా ప్రయత్నిస్తుంటుంది.కొత్త కొత్తగా ఉండే వస్త్రాలు,
లెటెస్ట్ క్యాస్టుమ్స్ తో ట్రెండ్ సెట్టర్ గా తనకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన పర్సనల్ డిజైనర్ అయిన మోనీషా
జైసింగ్ రూపొదించిన దుస్తుల్లో ఐసీడబ్యూ 2017 వేడుకలో మెరిసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఈ సందర్బంగా శిల్పా తన
స్టైల్స్ గురించి చెబుతూ స్టైల్ అనేది మన వ్యక్తిగతానికి చెందింది.అనుభవం అనేది మనం కొనుగోలు చేసేది కాదని, నా జీవితంలో చాలా
తప్పులు చేశానని ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాని చెప్పడానికే ఇష్టపడుతా. నేను ఎదైనా సరే కొత్తగా ట్రై చెయాలని అనుకుంటా.
నా డిజైనర్ కు నాకు కామన్ గా ఉండే ఆలోచనే ఇది. ఎవరో సెట్ చేసిన స్టైల్స్ ను ఫాలో అవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది శిల్పా