ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత చాలా మంది విషాదంలో మునిగిపోయారు. ఘన నివాళ్లు అర్పిస్తూ.. స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఆయన సేవలకుగానూ గుర్తింపు ఇవ్వాలని పలువురు ప్రముఖులు కోరారు. దీనిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. నాన్నగారే లేనప్పుడు భారతరత్న ఎందుకని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భావోధ్వేగానికి లోనయ్యారు.
‘ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మా నాన్నగారే లేనప్పుడు మాకు భారతరత్న ఎందుకు. మా నాన్నగారే మాకు భారతరత్. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే సంతోషం. ఇవ్వకపోయినా పర్వాలేదు. అంతకంటే ఏమి చేయలేము’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే పలువురు ప్రముఖులు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కూడా లేఖ రాశారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, హిందీ,తమిళ, కన్నడ బాషల్లో వేలాది పాటలు పాడి మెప్పించిన సంగతి తెలిసిందే.