మనం ఇప్పటి వరకు బొంగులో చికెన్ వండుతారని విన్నాం. మనలో కొంత మంది వాటిని రుచి చూసి ఉంటారు. అయితే బొంగులో కల్లు కూడా ఉందని మీకు తెలుసా? సర్వ సాధారణంగా తాటి చెట్ల నుంచి కల్లు తీసేటప్పుడు మట్టి కుండలు వాడుతారు. ఈ మధ్య కొందరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు అనుకోండి.
అయితే కల్లు కోసం తాటిచెట్లకు వెదురు బొంగులు కట్టడం మాత్రం వింతగానే అనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఇలా వెదురు బొంగులను వినియోగించి కల్లు తీస్తున్నారు గౌడ సోదరులు. ఇలా వెదురు బొంగులోంచి తీసిన కల్లు చాలా టేస్టీగా ఉంటుందని వారు చెప్తున్నారు. సో, మీరెప్పుడైనా అటువైపు వెళితే తప్పనిసరిగా రుచి చూడండి.