తమిళనాడులో 'బీస్ట్' సినిమాను బ్యాన్ చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడులో ‘బీస్ట్’ సినిమాను బ్యాన్ చేయండి

April 6, 2022

vijay

తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ తాజాగా నటించిన ‘బీస్ట్’ సినిమాను బ్యాన్ చేయాలని తమిళనాడు ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. ఇప్పటికే చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అంతేకాకుండా ఈ సినిమాను ఈనెల 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను సామాజిక మాధ్యమాల్లో చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైనా రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విడుదలైన ట్రైలర్ ప్రకారం.. ఓ మాల్‌లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని రక్షించే సైనికుడిగా విజయ్ కనిపించబోతున్నాడు. ఇటువంటి సమయంలో తమిళనాడులో సినిమాను బ్యాన్ చేయాలని ముస్లింలు నిరసనలు, ఆందోళన చేస్తున్నారు. సినిమాను ఎందుకు బ్యాన్ చేయాలని కోరుతున్నారు? సినిమాలో ఏఏ సన్నివేశాలు ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో బీస్ట్ సినిమాకు నిరసన సెగ తగులుతోంది. ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

బీస్ట్ సినిమాలో ముస్లింలను తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని లేఖలో ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా పేర్నొన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ, సినిమాలు తీయడం దురదృష్టకరమని అన్నారు. కావున సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని ఆయన కోరారు.

మరోపక్క ఈ చిత్రాన్ని కువైట్ దేశం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో సైతం నిరసన సెగ తగలడంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సినిమాను వీక్షించటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.