స్టాక్‌బ్రోకింగ్ సంస్థ కార్వీపై నిషేధం  - MicTv.in - Telugu News
mictv telugu

స్టాక్‌బ్రోకింగ్ సంస్థ కార్వీపై నిషేధం 

November 23, 2019

Ban on karvy stock brokerage company 

కార్పొరేట్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి కంపెనీలు బ్యాంకులకు కోట్ల పంగనామాలు పెట్టేసి బోర్డు తిప్పేస్తున్న నేపథ్యంలో వాటి షేర్ల కొనుగోళ్లు అమ్మకాల వ్యవహారాలు చూసే ఓ కంపెనీ కూడా అక్రమాలకు పాల్పడింది. క్లయింట్ల షేర్లను దారి మళ్లించి వారికి చెల్లింపులు జరపక దగా చేసింది.  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీపై నిషేధం వేటుపడింది. కొత్త క్లయింట్లను కూడా చేర్చుకోవద్దని ఆదేశించింది. 

తమ కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 2 వేల కోట్లను కంపెనీ దారి మళ్లించినట్లు తేలడంతో సెక్యూరిటీ ఎక్చేంజ్ ఆఫ్ బోర్డు(సెబీ) నిషేధం విధించింది. కార్వీపై జనవరిలో ఫిర్యాదు వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కార్వీ ఆఫీసుల్లో దాడులు చేసి, అక్రమాలు జరిగిన సంగతి నిజమేనని తేల్చింది. దీంతో ఇకపై షేర్ల ట్రేడింగ్ చేయకుండా కంపెనీపై వేటు పడింది. కార్వీ సంస్థ 2016 ఏప్రిల్- 2019 అక్టోబర్ మధ్య ఖతాదారులకు చెందిన రూ.1,096 కోట్లను తన అనుబంధ సంస్థకు మళ్లించింది. రూ.228.07 కోట్ల తనఖా షేర్లను బదిలీ చేసింది. మరో రూ.485 కోట్ల విలువైన అదనపు సెక్యూరీటీల క్లయింట్లకు తెలీకుండా అమ్మిపారేసింది. ట్రేడింగ్ చేయని అకౌంట్ల నుంచి రూ.116.3 కోట్ల విలువైన షేర్లను తనకు బదిలీ చేసుకుంది. సెబీ నిర్ణయంతో కార్వీ క్లయింట్లు ఇబ్బందులో పడ్డారు.