ఢిల్లీ, బెంగళూర్లలో మాంసంపై నిషేధం.. ఉత్తర్వులు జారీ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ, బెంగళూర్లలో మాంసంపై నిషేధం.. ఉత్తర్వులు జారీ

April 9, 2022

fhdghgfb

శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా నగర పాలిక సంస్థలు జారీ చేశాయి. దక్షిణ ఢిల్లీలో 4వ తేదీ నంచి 11వ తేదీ వరకు మాంసం విక్రయాలను నిలిపివేయాలని నగర మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశించారు. మాంసం విక్రయ షాపులతో పాటు కబేళాలను కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో అయితే చాలా మంది కనీసం వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా నవమి సందర్భంగా తినరని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ నిబంధనలు వినాయక చవితి, మహా శివరాత్రి సందర్భంగా అమలయ్యేవి. ఇప్పుడు శ్రీరామ నవమి కొత్తగా వచ్చింది. కాగా, నవమి ఆదివారం రానుండడంతో మాంస ప్రియులు ఒకింత నిరాశ చెందుతున్నారు. మరోవైపు మాంసం ధరలు భారీగా పెరిగినందున డబ్బులు ఆదా అవుతాయని సంతోషిస్తున్నారు.