Ban on plastic carry bags has come into effect in AP
mictv telugu

ఏపీలో నిషేధం అమలు.. ఇక నుంచి కేసులు నమోదు

January 3, 2023

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ఏపీలో విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి 120 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఈ నిబంధన డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రాగా, ఇక నుంచి ఎవరైనా వీటిని తయారు చేసినా, అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ పరిమితి 75 మైక్రాన్ల వరకు ఉండేది. ఇకపై వాడే ప్లాస్టిక్ వస్తువులు పునర్వినియోగానికి అవకాశమున్న సంచులను మాత్రమే వాడేలా పర్యవేక్షించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం కూడా ఈ నెల 26 వ తేదీ నుంచి అమలవుతుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. తనఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిస్తే అక్కడికక్కడే కేసుల నమోదుకు ఆస్కారం ఉంది.