Banana face packs for all skin types
mictv telugu

అరటితో అందం రెట్టింపు

November 17, 2022

Banana face packs for all skin types

అరటిపండులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఎ, బీ6 పుష్కలంగా ఉంటాయి. మనకు సహజ సిద్ధంగా దొరికే ఈ అరటిపండ్లతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మరింత నిగారిస్తుంది. చర్మం మీద ఉండే నల్లమచ్చలు, మృతకణాలు తొలగిపోవాలంటే ఈ ప్యాక్లను వేయాల్సిందే!

‌‌ _ ముఖం జిడ్డు కారుతున్నదా? అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి. అరటిపండును గుజ్జులా చేసి అందులో కీరదోస గుజ్జు, పొప్పడి పండును మెత్తగా చేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు రాసి 20నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే జిడ్డు మాయమయి మీ ముఖం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది.

‌‌_ సగం అరటిపండును తీసి గుజ్జు చేయాలి. దీనికి వేపాకు పేస్ట్ కలుపాలి. ఇందులో పసుపు వేసి పేస్ట్లా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఆరేవరకు అలాగే ఉంచాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది. ఈ ప్యాక్ యాక్నే, మొటిమల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్లు వేసుకుంటే మంచిది.

Banana face packs for all skin types

_ ఈ ప్యాక్కి రెండు వస్తువులు ఉంటే చాలు. అవి అరటిపండు, తేనె. సగం అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపాలి. దీన్ని ముఖం, మెడకు రాయాలి. పావుగంట తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడుగాలి. ఆ తర్వాత మీ ముఖంలో తేడాను మీరే గమనించవచ్చు. పొడి చర్మం కాస్త కొత్త రూపుతో మెరిసిపోతుంది.

‌‌_ అరటిపండు గుజ్జులో శనగపిండి, రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసం వేసి కలుపాలి. ఇందులో నిమ్మరసం ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే పొడిచర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం ఎలర్జీని తీసుకురావచ్చు. ఈ పేస్ట్ ముఖానికి, మెడకు రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్తో నల్లమచ్చలు కూడా పోతాయి.

Banana face packs for all skin types

‌_ పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖం మీద ఉన్న ముడతలను తగ్గిస్తుంది. ఈ పెరుగుకు అరటిపండు తోడైతే మరింత అందాన్ని పెంపొందించుకోవచ్చు. సగం అరటిపండు గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు కాదు.. నలుపు ఉన్న ప్రాంతాల్లో ఈ మిశ్రమాన్ని రాస్తే మంచి గుణం ఉంటుంది.

_ అరటిపండు గుజ్జులో, అరటి స్పూన్ తేనె, రెండు నిటేబుల్స్పూన్ల పచ్చి పాలు పోసి కలుపాలి. దీంట్లోనే కొద్దిగా రోజ్వాటర్ని కలిపితే మంచిది. దీన్ని ముఖానికి రాసి అలాగే వదిలేయాలి. కాసేపటి తర్వాత మామూలు నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చర్మం మరింత అందంగా తయారవుతుంది.

_ అవకాడో గుజ్జులో, కొద్దిగా అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, విటమిన్ ఇ క్యాప్సిల్ని పిండి పోయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత మామూలు నీళ్లతో కడుగాలి. ఇలా చేస్తే సన్ బర్న్, ట్యాన్ తగ్గుతుంది.