నేటికాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీలు లేదా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. దీని పెరుగుదలతో శరీరంలో మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీలపై డైరెక్టుగా ప్రభావం చూపుతుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ శాతం పెరిగినప్పుడు కీళ్లలో, కణజాలాల్లో నిక్షిప్తమవ్వడం వల్ల అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యతో హైబీపీ, కీళ్లనొప్పులు, నడవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు ఎదురౌతాయి. దీని వల్ల గౌట్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారు రోజుకు రెండు అరటిపండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో
అరటిపండు చాలా తక్కువ ప్యూరిన్ కలిగిన ఆహారం. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర ఆల్కైన్ స్వభావాన్ని పెంచడం ద్వారా యూరిక్ యాసిడ్ స్పటికలను కరిగిస్తుంది. అంటే మీ కీళ్లలో నొప్పి, మంటను కలిగించే ప్యూరిన్లను తొలగించడంలో అరటిపండ్లు సహాయపడతాయి. అంతేకాదు ఇందులోని సిట్రిక్ యాసిడ్ శరీరంలోని యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తాయి.
ఏ సమయంలో అరటి పండు తినాలి
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు భోజనం తర్వాత రెండు అరటిపండ్లు తినాలి. వాటిపై కొంచెం నల్ల ఉప్పు వేసుకుని తినాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ప్రయోజనాలు
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ప్యూరిన్ కణాలను బయటకు పంపిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఇక యూరిక్ యాసిడ్ సమస్యను నియంత్రించాలంటే ఎక్కువగా నీరు తాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి. శుద్ది చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి పనిచేస్తాయి. వాటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోండి. దీంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం మంచిది.