ఉత్తర తెలంగాణలో యాత్రలు సెగలు పుట్టిస్తున్నాయి. అటు బండి సంజయ్ పాదయాత్ర, ఇటు షర్మిల పాదయాత్ర పోలీసుల్ని టెన్షన్ పెడుతున్నాయి. వరంగల్ జిల్లాలో షర్మిల కారవాన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టారు. నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అటు బండిపాదయాత్రకు ముందే ఉద్రికత్తలు తలెత్తాయి. పోలీసులు పర్మిసన్ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లి బండి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ యాత్రలు సజావుగా సాగుతాయా? ఉద్రిక్తతలకు కారణాలేంటి?
మళ్లీ హీట్
తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఉత్తర తెలంగాణలో పాదయాత్రలతో హీట్ పెరుగుతోంది. అటు వరంగల్ జిల్లాలో షర్మిల యాత్ర కొనసాగుతుండగా ఇటు నిర్మల్ జిల్లా భైంసా నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు యాత్రల భద్రత పోలీసులకు సవాల్ గా మారింది.
కారవాన్‌కు నిప్పు
వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో షర్మిల కారవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై వైఎస్సాటీపీ అధ్యక్షురాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రగిలిపోయారు.
ఆమె కారవాన్‌ను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటనపై షర్మిల స్పందించారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఇలా చేయించారని ఆరోపించారు. ఆతర్వాత లింగగిరి దగ్గర షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతి ఉన్నా ఎందుకు అరెస్టు చేశారని పోలీసుల్ని షర్మిల ప్రశ్నించారు. బస్సుని తగులబెట్టిన వారిని టీఆర్ఎస్ కార్యకర్తల్ని వదిలేసి తనను అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఉద్రిక్తతల దృష్ట్యా షర్మిలని పోలీసులు అరెస్టు చేశారు.
బండి టూర్ టెన్షన్
బండి కదలడానికి హైకోర్టు షరతులు పెట్టింది. భైంసా మీదుగా వెళ్లకూడదు.3 కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవాలి..అంతేకాదు సభలో ఇతర మతాల్ని కించపరిచేవ్యాఖ్యలు చేయొద్దు.కార్యకర్తలు కర్రలు,ఆయుధాలు వాడొద్దు.. ఇవీ .బండిసంజయ్ పాదయాత్రపై హైకోర్టు పెట్టిన షరతులు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ముందుగా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భైంసాలో పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు బండి సంజయ్. విచారణ చేపట్టిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మరి బండి సంజయ్ పాదయాత్ర సజావుగా సాగుతుందా?
Few people alleged to be TRS followers tried to lit YSRTP’s campaigning bus on fire in Warangal, attack happened after YS Sharmila made some controversial statements on #TRS MLA Sudharshan. #Telangana pic.twitter.com/MydabSCoP7
— Sowmith Yakkati (@sowmith7) November 28, 2022