bandi sanjay attened the front of telangana state commission for women
mictv telugu

మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్.. కవితపై అనుచిత వ్యాఖ్యలపై వివరణ

March 18, 2023

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల అంశంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. బీజేపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో బుధ భవన్‌లోని మహిళా కమిషన్ విచారణకు వెళ్లారు. కవితపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ రెండు పేజీల లేఖలో వివరణ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్..తాను ఏం తప్పు చేయలేదు కాబట్టే మహిళా కమిషన్ ముందు హాజరైనట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే చెప్పానని..తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు కమిషన్ ముందు వెల్లడించారు.

TSPSC పేపర్ లీక్‌పై మరోసారి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో నిందితురాలుగా ఉన్న రేణుక కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నేతలని ఆరోపించారు. పేపర్ లీక్ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరోవైపు..మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బండి సంజయ్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు మహిళా కమిషన్ వద్దకు భారీగా చేరకున్నారు. బండి సంజయ్ వ్యతిరేకంగా ఆందోళన చేప్టారు. వెంటనే కవితకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపివేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవితపై ఇటీవల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ “తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా..ముద్దు పెట్టుకుంటారా” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. బండి సంజయ్ క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటుగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ ఈనెల 13న హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంట్ సమావేశాలు కారణంగా ఆ రోజు తనకు వీలు కాదని చెప్పిన బండి సంజయ్ నేడు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. బండి సంజయ్ వివరణపై మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందనని ఆసక్తి నెలకొంది.