తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం చేపట్టిన జేబీఎస్ పర్యటనను అడ్డుకొని పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ చార్జీల పెంపుకు నిరసనగా బస్టాండులో ఆందోళన నిర్వహించాలని సంయజ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ మేరకు యాక్షన్ తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించి చుట్టుముట్టారు. దాంతో బీజేపీ శ్రేణులు భారగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి. అనంతరం కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ పోలీసు వలయాన్ని ఛేదించుకొని జేబీఎస్‌కు చేరుకున్నారు. బస్టాండులో కలియతిరుగుతూ ప్రయాణీకులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు ఇంతగా పెంచినా, సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో కల్పించడం లేదని మండిపడ్డారు. కండీషన్లో లేని బస్సులు, బస్టాండులో కనీస వసతులు, శుభ్రత కరువయ్యాయని విమర్శించారు. ఈ మేరకు ఆ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
పోలీసుల వలయాన్ని ఛేదించుకొని జూబ్లీహిల్స్ నుంచి జేబీఎస్ కు వెళ్లిన @bandisanjay_bjp గారు.
బస్టాండ్ లో కలియతిరుగుతూ ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న బిజెపి రథసారధి.@trspartyonline ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి పెనుభారం మోపుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ప్రయాణికులు. pic.twitter.com/vZnKzg9a10
— BJP Telangana (@BJP4Telangana) June 10, 2022