Bandi Sanjay defended wearing sandals..
mictv telugu

చెప్పులు మోయడాన్ని సమర్థించుకున్న బండి సంజయ్

August 22, 2022

Bandi Sanjay defended wearing sandals..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తాజాగా కేటీఆర్ ట్విటర్ వేదికగా.. ”ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది” అని పేర్కొంటూ, బండి సంజయ్ కేంద్ర హూంశాఖ మంత్రి అమిత్ షా చెప్పులు మోసిన ఓ వీడియోను షేర్ చేశాడు. దాంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ క్రమంలో కాసేపటిక్రితమే బండి సంజయ్ కేటీఆర్ ట్విట్‌పై స్పందిస్తూ, పలు సంచలన కామెంట్స్ చేశారు. “కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను.. చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? మీరు సాష్టాంగ దండ ప్రమాణం చేసినప్పుడు బెంగాల్‌కు, తమిళనాడుకు గులాములు అయ్యారా? ఇప్పుడు పాదరక్షలు అందిస్తే, గుజరాత్‌కు గులాము అయినట్టా?. కేసీఆర్ లాగా అవసరాన్ని బట్టి పొర్లుదండాలు పెట్టడం మా రక్తంలో లేదు. అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబ సభ్యులకు పెద్దలకు, చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థమవుతుంది? రామ, భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం. తండ్రిని బంధించి, అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు మా సంస్కృతి ఏం అర్థమవుతుంది?” అని సమర్థించుకున్నారు.

మరోపక్క గతకొన్ని రోజులుగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అమిత్ షా మహాంకాళీ అమ్మవారిని దర్శంచుకున్న సందర్భంగా గుడి నుంచి బయటికి వస్తున్నా క్రమంలో బండి సంజయ్ ఆయన చెప్పులను మోసారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.