తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందని, క్రైస్తవంవల్లే భారత్ అభివృద్ధి చెందిందంటూ మాట్లాడిన హెల్త్ డైరెక్టర్ ను రోడ్లపై ఉరికించి కొట్టినా తప్పులేదని మండిపడ్డారు. వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కానీ కొందరు అధికారులు టీఆర్ఎస్‌కు చెంచాగిరి చేస్తున్నరు. డీహెచ్ శ్రీనివాస్ రావు పెద్ద అవినీతికి పరుడు. మెప్పుకోసం కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నడు. కేసీఆర్ కరోనాకు పారాసెట్మాల్ వేసుకోమని చెబుతుంటే… ఇంకో అధికారి (హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఉద్దేశించి) ఏమో… క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్ అభివృద్ధి చెందిందంటడు… సిగ్గుండాలే… అట్లయితే ఈ దేశంలో ఎందుకున్నవ్? ఈ దేశం విడిచి పో… ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మత ప్రచారం చేస్తవా? బాగా బరితెగించినరు. ఇలాంటి అధికారులు రోడ్లమీద యాడ కన్పించినా ఉరికించి ఉరికించి కొట్టండి” అని సంజయ్ మండిపడ్డారు.
హెల్త్ డైరెక్టర్‌గా ఉంటూ ఒక్క హాస్పిటల్‌లో కూడా సరైన సౌకర్యాలు కల్పించలేకపోయడంటూ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ ఆరోపించారు. నీ అవినీతి అంతా రుజువు చేయిస్తాంటూ సవాల్ విసిరారు బండి సంజయ్.
ఇవి కూడా చదవండి :
చంద్రబాబు పాలనలోనే తెలంగాణ దోపిడికి గురైంది: హరీష్ రావు
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘రైతు మహాధర్నా’..చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవు :కవిత