తనపై పరువు నష్టం దావా వేసిన ఐటీ మంత్రి కేటీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాల్ విసిరారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ పేర్కొన్నారు. ‘నీ వల్ల 27 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారిస్తే నిజాలు బయటక వస్తాయి. ఆత్మహత్యలకు కారకులెవరో తెలుస్తుంద’ని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో ఫ్రస్టేషన్తోటే తనకు లీగల్ నోటీసులు పంపారని విమర్శించారు. త్వరలో మీ దుబాయ్ లింకులను బయటపెడతామని హెచ్చరించారు. అలాగే అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్పై 420 కేసు నమోదు చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.