Bandi says letter on BJP being weak in Munugode is fake
mictv telugu

‘బండి సంజయ్ రాజీనామా చేశారా?.. ఆ లెటర్‌లో ఏముంది.?

November 2, 2022


రాబోయే మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓటమి పాలవుతుందని, అందుకు బాధ్యత వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండి సంజయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రచారంలో ఉన్న లేఖపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

దొంగ పాస్ పోర్టులు తయారు చేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం కష్టం కాదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు ఫోర్జరీ లేఖను రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని చేసినా మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ చేస్తున్న అబద్దాల ప్రచారాలు నవంబర్ 3తో ముగింపు అన్నారు. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుందని జోస్యం పలికారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.ఈ ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై ఎన్నికల సంఘానికి, పోలీసులుకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.