రేవంత్ ‘రెడ్డి’ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండ్ల గణేష్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ ‘రెడ్డి’ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండ్ల గణేష్

May 23, 2022

మాజీ కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, పదవి నుంచి ఆయనను తొలగించాలని రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. ‘పార్టీలు గెలవాలన్నా, రాజకీయం చేయాలన్నా రెడ్లకు అవకాశం, బాధ్యతలు ఇవ్వండి. రెడ్ల చేతుల్లో మీ పార్టీలను పెట్టండి’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బండ్ల గణేష్ స్పందించారు.

 

‘రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. అలాంటి రాష్ట్రాన్ని నడిపేందుకు కులతత్వం ఉన్న వ్యక్తి అనర్హుడు. రాహుల్ గాంధీ సామాజిక సూత్రం ప్రకారం రేవంత్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలి. చాలా మంది సీనియర్లు ఇప్పటికే ఆయనకు సహకరించడం లేదు. ఇప్పుడు మేం ఎవరిని ఫాలో కావాలి. రాహుల్‌నా? లేక రేవంత్‌నా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల చేతుల్లో బందీ అయిపోయింది. రేవంత్ తన వ్యాఖ్యలతో ఇతర కులాల కాంగ్రెస్ నాయకులను అవమానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శవపేటికకు రేవంత్ రెడ్డి చివరి మేకును కొట్టేశారు. ఒక్క మాటతో కాంగ్రెస్‌ను చంపేశారని’ ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.