Bandla Ganesh criticized Bandi Sanjay
mictv telugu

కేసీఆర్‌ని అంత మాటంటావా.. బండిపై బండ్లన్న ఫైర్

August 18, 2022

రాజకీయాలపై అప్పుడప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తపరిచే సినీ నటుడు బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్నారు. అందులో కేసీఆర్‌ని విమర్శించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. ‘సంజయ్ గారు కేసీఆర్‌ని చాలా పెద్ద మాట అన్నారు. పరమ శివుడి పేరు పెట్టుకున్న ఆయనను ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అంటాడా? ముస్లిం పేరుతో పిలిచి హిందూ మతాన్ని అవమానించారు. పాతబస్తీని వదిలి ఇంకో చోట పోటీ చేయని ఓవైసీని ఏమీ అనరు కానీ, కేసీఆర్, కేటీఆర్‌ను అంటారు. అమిత్ షా గారిని అమిత్ ఓవైసీ అంటే ఎంత బాధపడతారు? ముస్లింలు మనుషులు కాదా? మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. దేశంలో ఏ బీజేపీ నాయకుడికి లేనంత దైవభక్తి కేసీఆర్‌కు ఉంది. ఇది కాదనలేని సత్యం’ అని అభిప్రాయపడ్డారు.