స్టార్ హీరోలపై బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

స్టార్ హీరోలపై బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్..

June 23, 2022

 

”పూరీ జగన్నాథ్ గారి వల్ల మేము స్టార్లు అయ్యాం. సూపర్ స్టార్లు అయ్యాం అని వేదికల మీద తెగ చెప్పుకునే వాళ్లందరు పూరీ జగన్నాథ్ కొడుకు (ఆకాశ్ పూరీ)ని ఎంకరేజ్ చేస్తారేమోనని ఎంతో ఊహించాను. కానీ, వాళ్లు స్టార్లు కదా. ఎవరి బీజీ వాళ్లది. పూరీ జగన్నాథ్ వల్ల వాళ్లు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా ఆయన కొడుకును ఎంకరేజ్ చేసే బాధ్యతను తీసుకుంటారని అనుకున్నా, సినిమా కదా ఎవరు రారు. ఇది మాములే. మనం తప్పుగా అనుకోకూడదు. పూరీ గారితో ఒక సినిమా చేస్తే చాలురా బాబు అనుకున్న వారు కూడా అప్పుడు పూరి గారి బాబును జోలపెట్టిన వారు కూడా రారు” అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఆకాశ్ పూరీ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈవెంట్‌కు బండ్ల గణేశ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..” పూరీ జగన్నాథ్ ఎంతో మంది స్టార్లను తయారు చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆయన కొడుకు సినిమా ఫంక్షన్ జరుగుతుంటే రాకపోవడం నాకు నచ్చలేదు. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేను ఉండుంటే నా కొడుకు కోసం అన్ని పనులు మానుకుని మరీ వచ్చేసేవాడిని. అన్నా, ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణంపెడతా. ఎందుకంటే మనం ఏం సంపాదించినా భార్యాపిల్లల కోసమే. వాళ్ల బాధ్యత మనదే. చచ్చేదాకా వాళ్లను వదలకూడదు. నాలాంటి వాడిని స్టార్ ప్రొడ్యూసర్‌ని చేసి నీ కొడుకుని స్టార్‌ని చేయకుండా నువ్వు ముంబైలో కూర్చొంటే మేము ఒప్పుకోం. ‘చోర బజార్‌లో నీ కొడుకు అదరగొట్టేశాడు. నువ్వు చేసినా చేయకున్నా నీ కొడుకు స్టార్ అవుతాడు. నీ కొడుకు డేట్స్ కోసం నువ్వు క్యూలో నిల్చునే రోజులు తప్పకుండా వస్తాయ్” అని బండ్ల గణేశ్ అన్నారు.

మరోపక్క ‘చోర్ బజార్’ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాను డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ఈవెంట్‌లో ఆకాశ్ పూరీ మాట్లాడుతూ.. దయచేసి ప్రేక్షకులు నన్ను అదరించండి. నా సినిమాను ప్రోత్సహించండి. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. దయచేసి థియేటర్స్‌కు రండి’ అని వేడుకున్నాడు. పూరీ జగన్నాథ్..అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్, రాంచరణ్, రామ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.