bandla ganesh insults allu arjun brother
mictv telugu

అల్లు బ్రదర్స్ పనికిరానోళ్లు.. బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

December 5, 2022

బండ్ల గణేష్ కి నోటి దూల ఎక్కువని ఇండస్ట్రీలో అనుకోని వారుండరు. తనకి అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చి వివాదం అవుతుంటారు. రోజా, ఎన్టీఆర్, త్రివిక్రమ్ వంటి స్టార్స్ ని బాహాటంగా విమర్శించినా.. రాజకీయాల్లో పీక కోసుకుంటా అనే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినా అందరు లైట్ తీసుకున్నారు. కానీ మొన్న పూరి జగన్నాథ్ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చటం వంటి అంశాలపై బండ్ల గణేష్ పై విమర్శలు వచ్చాయి. ఛార్మి కోసం భార్యని మోసం చేస్తున్నాడన్నట్టు పూరి జగన్నాథ్ పై బండ్ల చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. దీనికి పూరి కూడా బండ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తరువాత టంగ్ స్లిప్ అయ్యాయని బండ్ల గణేష్ కూడా సర్దుకున్నాడు. ఈ ఉదంతం మరవకముందే ఇండస్ట్రీలో అగ్ర కుటుంబమైన అల్లు ఫ్యామిలీపై పడ్డాడు బండ్ల గణేష్. తాజాగా గుణశేఖర్ కుమార్తె వివాహానికి హాజరయ్యాడు బండ్ల గణేష్. వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీని గుర్తించిన బండ్ల గణేష్ బన్నీతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అయితే బండ్ల గణేష్ నోటిదూలని అక్కడివారు మొబైల్‌లో రికార్డ్ చేయగా.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ హీరో అయ్యాడు అంటూ బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కామెంట్స్ అల్లు బాబీని ఘోరంగా కించ పరిచే విధంగా ఉన్నాయి. అల్లు శిరీష్ కూడా తండ్రి చాటు బిడ్డనే. ఆహ, గీత ఆర్ట్స్, అల్లు వ్యాపారాలన్నీ శిరీష్ దెగ్గరుండీ చూస్తారని అంటారు. అల్లు కుటుంబంలో శిరీష్ బిజినెస్ మైండ్ అని పేరుంది. కానీ ఏం లాభం బన్నీ అంత పెద్ద స్టార్ కాదంటూ కామెంట్స్ చేశాడు. బన్నీ అన్న విద్యావంతుడు, తమ్ముడు బిజీనెస్ మెన్. కానీ తండ్రి మాట విని పనిరానివారిగా మిగిలిపోయారన్న అర్ధం వచ్చేలా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పై అల్లు అభిమానులు మండిపడుతున్నారు. వారి వ్యక్తిగత అంశాలు బండ్ల గణేష్ కి అనవసరమని.. కాస్త నోటిదూల తగ్గించుకుంటే బెటర్ అని అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.