Home > Featured > భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి : బండ్ల గణేష్

భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి : బండ్ల గణేష్

bandla ganesh satirical tweets on trivikram srinivas

బండ్ల గణేశ్‌.. సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తన మాటలతో అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తిని పొగడాలన్నా, విమర్శించాలన్నా ఆయన స్టైలే వేరు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు వైరల్గా మారుతాయి. ప్రస్తుతం ఆయన ఓ డైరెక్టర్ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్ అని తెలుస్తోంది. బండ్ల ఇచ్చిన గురూజీ అనే హింట్ అది త్రివక్రమ్ అని చెబుతోంది.

తనకు, పవన్ కళ్యాణ్ కు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ అని అర్ధం వచ్చేలా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు సాగినంత కాలం నా అంత వాడు లేడందురు. సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు. చెప్పడమే నా ధర్మం…వినకపోతే నీ ఖర్మం..గురూజీ ’’ అని ట్వీట్ చేశారు.

శుక్రవారం కూడా బండ్ల గణేష్ ఇటువంటి ట్వీట్సే చేశారు. ఓ నెటిజన్‌ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్‌ అవ్వాలని ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ‘గురూజీని కలవండి. ఖరీదైన కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్‌ ‘‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్‌ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించాడు. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. బండ్ల గణేష్ త్రివిక్రమ్ను పరోక్షంగా టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

Updated : 27 May 2023 1:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top