Bandla Ganesh Shocking Comments On Adult Movie
mictv telugu

బ్లూ ఫిలిమ్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

January 3, 2023

bandla ganesh about acting in adult movie

కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. చాలా ఏళ్లు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అగ్ర నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. యాక్టర్ నుండి ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో మరింత ఫెమస్ అయ్యాడు. అయితే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తోను వివాదస్పదం అవుతుంటాడు. పవన్‌ కళ్యాణ్ ని విపరీతంగా ప్రేమించే బండ్ల గణేష్ తేడా వస్తే కూడా అదే స్థాయిలో విరుచుకుపడతాడు. పవన్ తో గ్యాప్ వచ్చేలా చేస్తున్నాడన్న అనుమానంతో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటోళ్లని కూడా విమర్శించాడు బండ్ల గణేష్. నచ్చకపోతే ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, రవితేజ ఇలా ఎవర్నైనా తిట్టిపడేస్తాడు.. ఆ తరువాత సారీ కూడా చెప్పేస్తాడు.

అయితే మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తన కోపాన్ని పరోక్షంగా చూపిస్తూ.. పవన్ కళ్యాణ్ ప్రతిభను తాను చాలా కాలం క్రితమే గుర్తించానని.. పవన్ సామాన్యుడు కాదని తనకు ముందే తెలుసని.. ఇప్పుడు గురూజీ, బరూజీలు వచ్చారని (పరోక్షంగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి) బండ్ల గణేష్ అన్నారు. ఇక ఈ సందర్భంగా తన కెరీర్ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించటంపై కూడా స్పందించాడు బండ్ల గణేష్. నిజానికి అలాంటి సినిమాల్లో తాను నటించాలని అనుకోలేదని.. హీరో పాత్ర అని నిర్మాత నట్టి కుమార్ చెప్తే అలాంటి సినిమా ఒప్పుకున్నట్లుగా తెలియజేశాడు.అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదని.. బాడీని ఏదో పైకి కిందకి అంటే సరిపోతుంది అని ఏదో మాట్లాడి ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించాడు అని.. ముందే తెలిసి ఉంటే అలాంటి సినిమా చేయకపోయేవాడిని అని బండ్ల గణేష్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి : 

మైండ్ బ్లోయింగ్ మాస్.. రవితేజకి తోలి 100కోట్లు ?

అమెరికాలో బాలయ్య-మెగా ఫ్యాన్స్ ఫైటింగ్

నా లైఫ్‌లో ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. శ్రీజ

ఫెమస్ బిగ్ షాట్ తో.. యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. అధికారిక ప్రకటన ?

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి