నా దేవుడు ఓకే అన్నాడు.. పవన్‌తో బండ్ల గణేష్ కాంబో రిపీట్! - MicTv.in - Telugu News
mictv telugu

నా దేవుడు ఓకే అన్నాడు.. పవన్‌తో బండ్ల గణేష్ కాంబో రిపీట్!

September 28, 2020

[pavannn

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ బడా ప్రొడ్యూసర్ అయిపోయారు. అప్పట్లో వరుసగా సినిమాలు తీస్తూ.. విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి సినిమాలపై దృష్టిపెట్టాడు. పవన్ కల్యాన్ వీరాభిమానిగా ఉన్న గణేష్ అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాతో రికార్డ్ క్రియేట్ చేశాడు. అదే కాంబోను మరోసారి రిపీట్ చేయాలని మెగా ఫ్యాన్స్ కూడా అతన్ని కోరారు. 

ఈ నేపథ్యంలో సినిమా రంగంలో నా భవిష్యత్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతోన్నా అంటూ ఇటీవల పేర్కొన్నాడు. అన్నట్టుగానే సోమవారం ఉదయం 11.23 గంటలకు ఓ ట్వీట్ చేశాడు. పవన్ కల్యాన్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ని పెంచారు. అయితే అన్నట్టుగానే కొద్దిసేపటి క్రితం క్రేజీ అప్డేట్ ఇచ్చారు.‘నా బాస్ ఓకే అన్నాడు. నా కల మరోసారి నిజం అయింది. నా దేవుడికి నా ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని ఇండైరెక్ట్‌గా చెప్పడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఏ సినిమా తీయబోతున్నారు లాంటి విషయాలు మాత్రం వెల్లడికాలేదు.