కత్తి మహేష్ ను బెదిరిస్తున్న బండ్ల గణేష్... - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి మహేష్ ను బెదిరిస్తున్న బండ్ల గణేష్…

August 29, 2017

సినీ విమర్శకుడు  కత్తి మహేష్ ఓ ఇంటర్వ్యూలో  పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. పవన్ అభిమానులు గత మూడు రోజుల నుంచి కత్తి మహేష్ కు కాల్స్, మెస్సేజెస్ చేస్తూ వేధిస్తున్నారు.  ఏకంగా లైవ్ ప్రోగ్రాం లో కూడా పవన్ ప్యాన్స్ మహేష్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు.  దానితో మహేష్ ‘నా పర్స్ నల్ లైప్ ను  డిస్ట్రబ్ చేయద్దు’ అని విన్నవించుకున్నటికి కూడా పవన్ ప్యాన్స్ మాత్రం  వినడం లేదు. ఇప్పడు ఈ వివాదానికి మరింత సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్వీటర్ ద్వారా అగ్గికి ఆజ్యం పోశాడు.

‘‘తమ్ముడూ..  కత్తి మహేష్  సూర్యుడి వైపు చూడకు. ఆ సూర్య కిరణాలమైన మాలాంటి వారిచే మాడి మసైపోతావు..’’ అని ట్వీటర్ లో హెచ్చరించాడు.

‘నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవర్ స్టార్ కు లేదు రాదు. సూర్యుని గురించి  ఆయన శక్తి గురించి ఆలోచించే బుర్ర లేదులేదు . అందుకే అర్హతకు మించి మాట్లాడుతున్నావ్’  అని కొందురు అభిమానులు చేసిన ట్వీట్స్ ను బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. దీంతో  ఈ వివాదం మరింత రాజుకుంది. పవన్ వర్సెస్ మహేష్ కత్తి వివాదంతో వార్తాలలో లేని బండ్ల గణేష్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. బండ్ల గణేష్ త్వరలో ఎన్టీఆర్ తో ఓ సినిమాను నిర్మించబోతున్నట్ట సమాచారం.