Bandla Ganesh's hot comments on Vijay..that should be too
mictv telugu

విజయ్‌పై బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్..అది కూడా ఉండాలి

July 23, 2022

Bandla Ganesh's hot comments on Vijay..that should be too

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. ”తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి బ్రదర్.. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గొప్ప టాలెంట్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకో” అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్‌లో అటు నెట్టింట హాట్ టాఫిక్‌గా మారాయి. మరోపక్క రౌడీ బాయ్ అభిమానులు బండ్ల గణేశ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తెరకెక్కించిన ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ భామ అనన్యాపాండే హీరోయిన్‌గా, ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే హైదరాబాద్‌ చిత్రబృందం విడుదల చేసింది.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ నెపోటిజం గురించి మాట్లాడుతూ..”మీకు మా అయ్య తెలవదు, మా తాత తెలవదు ఎవ్వడు తెలవదు. రెండేళ్లవుతోంది సినిమా రిలీజై, ఆ ముందు రిలీజైన సినిమా కూడా అంతపెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా టైలర్‌కి ఈ రచ్చేందిరా నాయనా” అంటూ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. అనంతరం విజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ సోషల్ మీడియాలో.. ‘విజయ్ మాట్లాడిన మాటలు.. మెగా హీరోను ఉద్దేశించే అన్నాడు’ అని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ సైతం ట్విటర్ వేదికగా స్పందిస్తూ, తన మనసులోని భావాలను వెల్లడించారు. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక, ఈ ట్వీట్ కచ్చితంగా రౌడీ హీరోకే కౌంటర్ అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.