bangaldesh vs india 2nd test score update
mictv telugu

బంగ్లాతో రెండో టెస్టులో 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

December 23, 2022

bangaldesh vs india 2nd test score update

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ కాస్త తడబడుతోంది. ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టపోయి 86 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(18), పంత్(12) ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 19/0తో బ్యాటింగ్‎ను ప్రారంభించిన భారత్‌‌ను బంగ్లా బౌలర్ తైజుల ఇస్లామ్ దెబ్బకొట్టాడు. 14వ ఓవరల్‌లో రాహుల్(10) ను, 16వ ఓవర్‌లో గిల్ (20)ను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‎కు పంపాడు. తర్వాత పుజారా, కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న సమయంలో మరోసారి భారత్‎కు ఇస్లామ్ షాక్ ఇచ్చాడు. క్రీజ్‌లో పాతుకుపోతున్న పుజారాను(24) ఔట్ చేశాడు. అనంతరం పంత్, కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆటను కొనసాగిస్తున్నారు. బంగ్లాస్కోరు కంటే భారత్ ఇంకా 141 పరుగుల వెనుకంజలో ఉంది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే..