కేజీఎఫ్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశం - Telugu News - Mic tv
mictv telugu

కేజీఎఫ్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశం

November 7, 2022

బెంగళూరు కోర్టు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు భారత్ జోడో యాత్ర అకౌంట్ కూడా బ్లాక్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. యాత్రలో భాగంగా కేజీఎఫ్ 2 చిత్రంలోని పాటలతో కూడిన రెండు వీడియోలను సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో తమ అనుమతి లేకుండా పాటలను వాడుకున్నారంటూ ఎంఆర్‌‌‌టీ మ్యూజిక్ సంస్థ రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటేలపై కేసు వేసింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు కాపీరైట్ ఉల్లంఘన నిజమేనంటూ ఈ మేరకు తీర్పునిచ్చింది.

రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేశారు. కాగా, తెలంగాణలో నాలుగు రోజులు విరామం సహా 16 రోజులు కొనసాగిన రాహుల్ యాత్ర ముగిసింది. తర్వాత మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌‌‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణలో కార్యకర్తల కష్టం స్వయంగా చూశానని, రైతుల బాధలు పూర్తిగా తెలుసుకున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు.