బెంగళూరు-హౌరా దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్ ఎస్9 బోగీ నుంచి మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బోగి కింద నుంచి గట్టిగా శబ్దం వచ్చి పొగ రావడం గమనించిన ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక అందరూ కంగారుపడ్డారు. ఘటనపై సమాచారం అందకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో రైల్వే స్టేషన్లో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.