దిశ ఘటన ఎఫెక్ట్.. మెట్రో కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

దిశ ఘటన ఎఫెక్ట్.. మెట్రో కీలక నిర్ణయం

December 4, 2019

Bangalore Metro01

శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే బెంగుళూరు మెట్రో రైలు తన నిబంధనల్లో మార్పులు చేసింది. మహిళల  రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా లోపలికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

సాధారణంగా మెట్రోలో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అవి మహిళ వద్ద అవి గుర్తిస్తే ఇది వరకు వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లచ్చని ఆదేశాలు జారీచేసింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు వెల్లడించారు.