టాస్ గెలిచిన బెంగళూరు.. మొదలైన ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

టాస్ గెలిచిన బెంగళూరు.. మొదలైన ఉత్కంఠ

March 30, 2022

gnfghb

క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ముంబై వేదికగా మొదలైన తొలి మ్యాచ్‌ నుంచి నేటీవరకు ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటను చూడటం కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. బుధవారం కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైకు షాకిచ్చిన కోల్‌కతా అదే జోష్‌తో ముందుకు వెళ్లనుంది.

ఇక, తన తొలి మ్యాచ్‌లో 205 పరుగులు చేసినా గెలుపును నిలబెట్టుకోలేని బెంగళూరు… తప్పొప్పులను బేరీజు వేసుకొని బరిలోకి దిగనుంది. ఈ మేరకు టాస్ నెగ్గిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకొని, కోల్‌కతాకు బ్యాటింగ్ అప్పగించింది. అయితే కోల్‌కతాలో వెంకటేష్ అయ్యర్, రహానె, నితీష్ రాణా, శ్రేయస్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, రస్సెల్, జాక్సన్, నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. బెంగళూరులో డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, కోహ్లి, దినేష్ కార్తీక్, రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా బెంగుళూరే గెలుస్తుందని కొందరు. లేదు లేదు మళ్లీ కోల్‌కతానే గెలుస్తుందని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి ఇంతకి ఏ టీం గెలుస్తుందో, ఏ ఆటగాడు సెంచరీ చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.