రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తుది టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగింది. ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు కాసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టును టీమిండియా ఇప్పటికే సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా మరో భారీ విజయం కన్నేసింది. రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా జకీర్ హుస్సేన్, నజ్మూల్ హుస్సేన్ బరిలోకి దిగారు. ప్రస్తుత స్కోరు 10 ఓవర్లకు 22 పరుగులుగా ఉంది.
కేల్ రాహుల్ నేతృత్వంలో టీమ్ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ స్థానంలో జైదేవ్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నది. బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. యాసిర్ స్థానంలో మోమినుల్ హక్, ఎబడట్ స్థానంలో తస్కిన్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. ఈ టెస్టులో టీమిండియా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఓడితే సిరీస్ సమమవుతుంది. కాబట్టి విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది.