షకిబుల్ కొత్త అవతారం..క్రికెట్‌లో నిషేధిస్తే ఫుట్‌బాల్ ఉందిగా - MicTv.in - Telugu News
mictv telugu

షకిబుల్ కొత్త అవతారం..క్రికెట్‌లో నిషేధిస్తే ఫుట్‌బాల్ ఉందిగా

November 9, 2019

బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హాసన్ ఫుట్‌‌బాల్ ప్లేయర్ అవతారమెత్తాడు. ఇటీవల షకిబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి రెండేళ్లు నిషేధం విధించిందిన సంగతి తెలిసిందే. తనను ఒక బుకీ సంప్రదించినా ఆ విషయాన్ని దాచి పెట్టడంతో ఐసీసీ షకిబుల్‌పై 24 నెలలు నిషేధం విధించింది. 

నిషేధం కారణంగా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు షకిబుల్‌ దూరం అయ్యాడు. క్రికెట్‌కు దూరం కావడంతో తాజాగా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అవతారం ఎత్తాడు. బంగ్లాదేశ్‌ ఆర్మీ స్టేడియంలో కొరియన్‌ ఎక్స్‌పాట్‌ జట్టుతో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఫూటీ హ్యాగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో ఫూటీ హ్యాగ్స్‌ 3-2 తేడాతో కొరియన్‌ ఎక్స్‌పాట్‌ జట్టుపై విజయం సాదించింది. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ జట్టు షకిబుల్‌ లేకుండానే ఆడుతోంది. నిషేధం కారణంగా బంగ్లా జట్టు స్టార్ ఆల్ రౌండర్‌ను కోల్పోయింది. ఈ ప్రభావం జట్టుపై స్పష్టంగా కన్పడుతోందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.