Bangladesh ferry accident kills 23, dozens missing
mictv telugu

ఘోర పడవ ప్రమాదం.. 23 మంది మృతి

September 25, 2022

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునగడంతో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా డజన్లకొద్దీ జనం గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే, ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహరుల్‌ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య ఖచ్చితంగా ఎంతన్నది తెలియదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.