బంగ్లదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఎదుట 145 పరుగుల స్వల్ప లక్ష్యం నిలించింది. అయినా మన జట్టు తడబడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 23 ఓవర్లకు గాను 45 పరుగులు మాత్రమే చేసింది. మరో రెండు రోజుల్లో వంద చేస్తే గెలిచేస్తుంది. బంగ్లా స్పిన్నర్లు ధాటిగా ఆడడంతో మనోళ్లు కకావికలయ్యారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 2, శుబ్మన్ 7, ఛతేశ్వర్ పూజారా 2, కోహ్లీ 1 పరుగులు చేశారు. అంతకు ముందు బంగ్లా జట్టు రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు చెలరేగి వికెట్లు తీయంత బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. అయినప్పటికీ జకీర్ హసన్(51), లిటన్ దాస్ (73) అర్ధ సెంచరీ శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మన బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చెరో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులు చేయగా, భారత్ 314 పరుగులు చేసింది.