ఇస్కాన్ టెంపుల్‌పై మూక దాడి.. కూల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఇస్కాన్ టెంపుల్‌పై మూక దాడి.. కూల్చివేత

March 18, 2022

 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ దేవాలయం దాడికి గురైంది. దాదాపు 200 మందితో కూడిన అల్లరి మూకలు గురువారం రాత్రి ఆలయంపై దాడికి దిగి కూల్చివేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరిపై కూడా దాడి చేయడంతో వారు గాయపడ్డారు. ఈ మేరకు వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే సంస్థ తెలిపింది. దాడులు జరుగుతున్నప్పుడు తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అంతేకాక, దాడులు చేస్తున్నప్పుడు స్థానిక పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని పేర్కొంది. ఓల్డ్ ఢాకాలోని వారీలో ఇస్కాన్ రాధాకంట టెంపుల్ ఉంది. తాజా దాడిలో ఆలయంలో ఉన్న విగ్రహ మూర్తిని ధ్వంసం చేయడంతో పాటు దొరికిన నగదును దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి దాడులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య కొమిల్లా అనే పట్టణంలో నవరాత్రుల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.