Bangladesh oil petrol prices hiked Bangladesh oil petrol prices hiked
mictv telugu

పెట్రోల్‌పై 52 శాతం పెంపు.. బంగ్లాదేశ్‌లో బుగులు..

August 8, 2022

Bangladesh oil petrol prices hiked

పొరుగు దేశం బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతోంది. పాకిస్తాన్, శ్రీలంక దారిలో వెళ్తూ సంక్షోభంలో చిక్కుకుపోయింది. అనూహ్యంగా పెరిగిన ఇంధన ధరలే దీనికి కారణం. అక్కడి ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 52 శాతం పెంచేసింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర 130 టాకాలకు పెరిగింది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 109 చిల్లర. ఒక టాకా భారత కరెన్సీలో రూ. 1.19.

బంగ్లా సర్కారు పెట్రోల్‌తోపాటు డీజల్ ధరను 32 టాకాలు, ఆక్టేన్ ధరను 46 టాకాలు పెంచింది. కిరోసిన్ ధర కూడా 42 శాతం పెరిగింది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు బంగ్లాదేశ్‌ను ఇక్కట్లలో పడేస్తున్నాయి. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టే ధరలను పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. స్వల్పం మొత్తంలో పెంచకుండా భారీగా పెంచడం సరికాదని, వెంటనే నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ తలపైన 2020 నాటికి రూ. 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా వేగంగానే అభివృద్ధి సాధిస్తూ ఇలా సంక్షోభంలో కూరకుపోయింది.