దేహాన్ని అమ్ముకునే వాళ్లు ఆయన దృష్టిలో దేవతలు... - MicTv.in - Telugu News
mictv telugu

దేహాన్ని అమ్ముకునే వాళ్లు ఆయన దృష్టిలో దేవతలు…

November 23, 2017

దేశాలు వేరైనా మారని దేహాలు అవి. ఆకలి ముందు ఓడిన జీవితాలు వాళ్లవి.. నిద్రలేని రాత్రులతో ధ్వంసమయ్యే జీవితాలు అవి.వేడి నిట్టూర్పుల  వెచ్చదనంలో నిలువెల్లా కాలిపోయే బతుకు చిత్రాలు వాళ్లవి. ప్రపంచంలోనే అతి పురాతన వృత్తిలో ప్రతీక్షణం చస్తూ బతుకున్న గాయాలు వాళ్లు. అలాంటి సెక్స్ వర్కర్లు తన దృష్టిలో దేహాన్ని అమ్ముకునే దేవతలు అంటాడు ఫోటోగ్రాఫర్ ఆకాశ్. బంగ్లాదేశ్ లో ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన ఆకాశ్, అక్కడి సెక్స్ వర్కర్ల జిందగీని తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు. ఆ ఫోటోలు…..

తను శవమై…ఒకరికి వశమై…తనువు పుండై..ఒకడికి పండై…ఎప్పుడూ ఎడారై..ఎందరికో ఒయాసిస్సై..జీవిత కారాగారంలో జీవచ్ఛవమై….ముక్కలైన ప్రతిబింబమై….ఆకలిని తీర్చే అధరమై…ముస్తాబయ్యే గాయమై….వీధిలో అంగడిబొమ్మై….ఏ వెలుగూ సోకని కొవ్వొత్తై……

Photo courtesy:- GMB AKASH

http://www.gmb-akash.com/